తమిళ హీరో జీవా హీరోగా నటిస్తున్న కావలై వేండమ్ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న సినిమా యూనిట్ ఖాళీ సమయాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అయితే మరీనూ. టూరిస్ట్ ప్లేస్‌లన్నీ పనిలో పనిగా చుట్టేసి వస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఈ అమ్మడు. రోజుకో ఫోటోతో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటున్న ఈ బ్యూటీ రెండు రోజుల క్రితం స్విమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. పక్కనే జీవా కూడా ఉన్నాడు. మొత్తానికి ప్రొఫెషన్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కాజల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందన్నమాట.
