టాలీవుడ్‌లో యేడాదికి కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో కనీసం 10 శాతమైనా సక్సెస్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే రికార్డులు సృష్టిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల సంగతి కాసేపు పక్కనపెడితే ఇటీవల ఓవర్సీస్‌లో రికార్డులు సృష్టించాలని హీరోలు తెగ ఆరాటపడుతున్నారు. ఓవర్సీస్‌లో 10 లక్షల డాలర్లు( మిలియన్ డాలర్ల) మార్కును దాటడం ఓ రికార్డు వంటిది. అలా దాటాలంటే కథలో కంటెంట్ ఎంతో ముఖ్యం. అలా ఈ యేడాది వచ్చిన వందలాది సినిమాల్లో ఇప్పటివరకూ కేవలం 7 సినిమాలు మాత్రమే ఆ మార్కును దాటాయంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. మరి ఆ సినిమాల్లో కథాబలమున్న పెళ్లి చూపులు వంటి సినిమా ఉందంటేనే తెలుస్తోంది ఎన్నారైల సినీ అభిలాష ఏంటో. ఆ ఏడు సినిమాల్లోనూ ఎన్టీఆర్ సినిమాలు రెండు ఉన్నాయి. ఈ యేడాది విడుదలయిన ఎన్టీఆర్ రెండు సినిమాలు అతి తక్కువ రోజుల్లోనే మిలియన్ డాలర్ల మార్కును సాధించడం విశేషం. నాన్నకు ప్రేమతో సినిమా నాలుగు రోజుల్లో 1323334 డాలర్లను సంపాధించగా.. జనతాగ్యారేజ్ సినిమా మూడు రోజుల్లోనే 1231704 డాలర్లను కొల్లగొట్టడం ఎన్టీఆర్‌కు పెరుగుతున్న ఓవర్సీస్ మార్కెట్‌ను సూచిస్తోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
2016లో ఇప్పటివరకూ ఈ 7 సినిమాలదే రికార్డ్