బరువు తగ్గడానికి ఇంతకు మించిన ఉత్తమ మార్గం ఉండదేమో !




  • జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి
  • నీరు, పండ్లు అధికంగా తీసుకోవాలి
  • రోజూ అరగంట పాటు వ్యాయామం అవసరం
  • అప్రమత్తతే శ్రీరామరక్ష అంటున్న వైద్యులు

ప్రస్తుత సమాజంలో మానవునికి ఊబకాయం ప్రధాన అడ్డంకిగా మారింది. జీవన శైలిలో మార్పుల కారణంగా జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటుపడి విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీని వల్ల.. జబ్బులు అధికమవుతున్నాయి. కాళ్ల నొప్పులతో ప్రతి ఒక్కరూ.. ఇబ్బందులు పడుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే బరువు అదుపులో ఉండి.. వ్యాధులను అరికట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు ఇలా..

  • ప్రతి ఒక్కరూ.. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.
  • ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగాలి
  • ఉదయం పొట్ట భాగంలో నూనెతో(కొబ్బరినూనె, నువ్వులనూనె, ఆలివ్‌ నూనె) ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్‌ చేయాలి.
  • ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం(వాకింగ్‌, జాగింగ్‌) చేయాలి.
  • ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఉదయం సూర్యకాంతిలో ఉండాలి.
  • ఉదయం 9 గంటల లోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేయాలి.
  • వీటిలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మధ్యాహ్నం 1 గంటలోపు లంచ తీసుకోవాలి.
  • రాత్రి 7 గంటల లోపే రాత్రి భోజనం ముగించాలి.
  • సి-విటమిన్‌ అధికంగా ఉండే.. బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, స్ట్రాబెర్రీ, యాపిల్‌ తీసుకోవాలి.
  • భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
  • రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
  • మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
  • బయట దొరికే జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
  • రాత్రి వేళ కనీసం ఏడు గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి.
  • ఇలా చేస్తే మీలక్ష్యం నెరవేరి అధిక బరువు నుంచి విముక్తి పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు.
  • మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.