నాకు ధోనీ అంటే ఇష్టం లేదు.. సచినంటేనే అభిమానం

నాకు ధోనీ అంటే ఇష్టం లేదు.. సచినంటేనే అభిమానం

       తాను ధోనీ అభిమానిని కాదని, సచిన్ టెండూల్కర్ అంటేనే ఇష్టమని ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ చిత్ర దర్శకుడు నీరజ్ పాండే పేర్కొన్నారు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ తాను ధోనీ అభిమానని కాదని తేల్చి చెప్పారు. సినిమా తీయాలంటే అభిమానే అయి ఉండక్కర్లేదని పేర్కొన్నారు. అభిమాని అయితే సినిమా చిత్రీకరణలో కొంత వివక్ష ఉండేదని, లేదు కాబట్టే స్వేచ్ఛగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. నిజానికి తాను సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్‌లను ఇష్టపడతానని నీరజ్ వివరించారు.